హామీలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం

హామీలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిందని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ అన్నారు.గురువారం మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మండల అధ్యక్షులు సూరబోయిన సతీష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు బోనస్ చెల్లించకుండా రైతులను ఇబ్బంది పెడుతుందన్నారు.
స్థానిక ఎమ్మెల్యే విప్ పదవిని కాపాడుకునే ప్రయత్నంలో హైదరాబాదు చుట్టు తిరుగుతున్నాడే తప్ప డోర్నకల్ నియోజకవర్గంలో పర్యటనలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి గ్రామాల వారిగా పర్యటించి ప్రజల బాగోగులు తెలుసుకొని, అభివృద్ధికి తోడ్పడాలని సూచిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ కుంభం అశోక్ రెడ్డి,నెలకుర్తి సత్యనారాయణ రెడ్డి ,బీనపల్లి సతీష్,ఎరనాగి గోపి తదితరులు ఉన్నారు.
