Development | గ‌వ‌ర్న‌ర్‌తో క‌లెక్ట‌ర్ భేటీ…

Development | గ‌వ‌ర్న‌ర్‌తో క‌లెక్ట‌ర్ భేటీ…

Development | బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ బృందం గోవా పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజును కలిశారు. బాపట్ల తీర ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం. బీచ్ మేనేజ్మెంట్, పర్యాటకుల భద్రత, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనపై గోవా అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులపై చర్చించారు.

గోవా టూరిజం మోడల్‌ను అధ్యయనం చేసి, బాపట్ల తీర అభివృద్ధికి ఆ నమూనాలను వర్తింపజేయాలని కలెక్టర్ నిర్ణయించారు. బాపట్ల పురపాలక కమిషనర్ జి రఘునాథరెడ్డి, జిల్లా పర్యాటక అధికారి షేక్ అలీ అస్గర్, ఏపీ పర్యాటక శాఖ ప్రాజెక్టు మేనేజర్ శివ శరణ్, షేక్ సజిత్, చీరాల తహసిల్దార్ గోపికృష్ణ, వేటపాలెం ఎంపీడీవో రాజేష్ బాబు గోవా పర్యటనలో ఉన్నారు.

Development |
Development |

Leave a Reply