AP | ఎన్టీఆర్ ట్రస్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ భారీ విరాళం !
తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు భారీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళంగా అందజేశారు.
కాగా, విజయవాడ వేదికగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ కన్సర్ట్ జరగుతుండగా. ఈ మ్యూజికల్ ఈవెంట్‌లో థమన్ తో పాటు ప్రముఖ డ్రమ్స్ ప్లేయర్ శివమణి సహా దాదాపు 50 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు.
![](https://prabhanews.com/wp-content/uploads/2025/02/image-143-1024x684.png)