Deputy CM | ఘన స్వాగతం..

Deputy CM | ఘన స్వాగతం..

Deputy CM, రేణిగుంట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు (Pawan kalyan) రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం లభించింది. గురువారం చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లా పర్యటన నిమిత్తం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వెలుపల ప్రజల వద్ద నుండి పవన్ కళ్యాణ్ అర్జీలు స్వీకరించారు. అనంతరం రోడ్డు మార్గాన చిత్తూరు జిల్లాకు బయల్దేరి వెళ్ళారు.

విమానాశ్రయంలో ఆయనకు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, రైల్వే కోడూరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, అరవ శ్రీధర్, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ హరి ప్రసాద్, శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్యనాయుడు, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, తదితరుల స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Leave a Reply