దీర్ఘకాలిక రోగులకు మినహాయింపు ఇవ్వాలి…

దీర్ఘకాలిక రోగులకు మినహాయింపు ఇవ్వాలి…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తి కావస్తున్నాయి.జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షా పత్రాల మూల్యాంకనంలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, జిల్లా అదనపు కార్యదర్శి మల్లెల పుల్లయ్య లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెన్ను, నడుము, సయాటికా, మోకాళ్ళ నొప్పులతో బాధపడే ఉపాధ్యాయులకు అలాగే గుండె సంబంధిత జబ్బులతో, క్యాన్సర్ జబ్బులతో,నరాల బలహీనతతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు మెడికల్ గ్రౌండ్స్ కింద మూల్యాంకనం నుండి మినహాయింపు ఇవ్వాలని డీఈఓ ని కోరారు. మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు నియామకు ఉత్తర్వులు కమిషనర్ పరిధిలో కాకుండా జిల్లా స్థాయిలో డీఈఓ పరిధిలోనే ఇవ్వవలెనని కోరారు. మార్పులు – చేర్పులు చేయుటకు, ఆసక్తి గల ఉపాధ్యాయులను నియామకం చేసుకొనుటకు డిఈఓ కి స్వేచ్ఛ కల్పించాలని వారు కమిషనర్ ని డిమాండ్ చేశారు.

మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులకు అవసరమగు అన్ని సౌకర్యాలను కల్పించాలని వారు డీఈఓ ని కోరారు. మూల్యాంకనం సజావుగా జరగడానికి తమ సంఘం సంపూర్ణంగా సహకరిస్తుందని వారు డీఈఓ కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు పవన్ కుమార్, జయరాం, నగిరి వెంకటేశ్వర్లు, కాసిం సాహెబ్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply