Telangana | ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్

Telangana |చెన్నూర్ ఆంధ్రప్రభ : 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని బిసి జెఏసి నాయకులు సిద్ది రమేష్ యాదవ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన బిసి డిక్లరేషన్లో హామీ (Guarantee in the declaration) ఇచ్చిన 42శాతం బిసి రిజర్వేషన్లను పూర్తిగా విమర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.నియోజకవర్గం లోని మండలవారీగా బిసి లకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టారు.

చెన్నూరు మండలానికి 30గ్రామ పంచాయతీలకు గాను రెండు బిసి సీట్లు, కోటపెల్లి (Kotapelli) 31గ్రామపంచాయతీలకు గాను ఒక్క బిసి సీటు, భీమారం మండలం 10గ్రామపంచాయతీ లకు గాను బిసిలకు ఒక్క సీటు, జైపూర్ మండలం 20గ్రామపంచాయతీలకు గాను కేవలం ఒక్క సీటు, మందమర్రి మండలంలో 10గ్రామపంచాయతీ లకు గాను బిసి లకు ఒక్క సీటు కూడా కేటాయించక లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ప్రక్రియ అమలు జరిగేవరకు ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply