Delhi Tour | కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటి.. సోలార్ ఎనర్జీ పై చర్చలు

రూఫ్ టాప్ ఫ్రీ సోలార్​
ఎస్సీ, ఎస్టీల‌కు ₹20 లక్షల బెనిఫిట్స్ ​
హరిత ఇంధనాన్ని మరింత చేరువచేయడమే లక్ష్యం
యువతకు ఉద్యోగ కల్పనలో మరింత ప్రోత్సాహం
కేంద్రమంత్రితో భేటీలో సీఎం చంద్రబాబు
ఢిల్లీలో కొన‌సాగుతున్న ఏపీ సీఎం ప‌ర్య‌ట‌న‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో హరిత ఇంధనాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్య కేటాయింపుల కోసం ఒక ప్రతిపాదనను సమర్పించారు.

బీసీలకు సబ్సిడీ కింద అందజేత..

2025 జనవరిలో మంత్రిత్వ శాఖకు ఏపీ డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనకు త్వరితగతిన ఆమోదం తెలపాలని సీఎం కేంద్రాన్ని కోరారు. ఈ ప్రతిపాదన కింద 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు లభిస్తాయి. అలాగే, బీసీ గృహాలకు కిలోవాట్‌కు ₹10,000 చొప్పున 2 కిలోవాట్ల వరకు అమర్చుకునేలా సబ్సిడీ అందుబాటులో ఉంటుంది.

ఉద్యోగ కల్పనలో ప్రోత్సాహం..

రాష్ట్ర క్లీన్ ఎనర్జీ పాలసీ 2024-29లో భాగంగా అదనంగా 72.6 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని, ఇందులో 40 గిగావాట్ల సౌరశక్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సామాన్యులకు సౌరశక్తిని అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రతిపాదిత యుటిలిటీ-నేతృత్వంలోని రూఫ్‌టాప్ మోడల్ ఏపీ విద్యుత్ కొనుగోలు వ్యయాలను తగ్గించడంతో పాటు, బలహీన వర్గాలకు సాధికారత కల్పిస్తుంది. ఉద్యోగ కల్పనను ప్రోత్సహిస్తుంది. కేంద్రం సహకరిస్తే, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన వినియోగంలో దేశానికి మునుముందు మార్గనిర్దేశం చేయగలదని.. ఒక బెంచ్‌మార్క్‌ను నెలకొల్పుతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply