Delhi High Court | బట్టల షాపులపై ఢిల్లీ పోలీసుల దాడి

Delhi High Court | బట్టల షాపులపై ఢిల్లీ పోలీసుల దాడి
Delhi High Court | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని పలు బట్టల దుకాణాలపై ఢిల్లీ పోలీసులు(Delhi Police) దాడులు చేశారు. ఢిల్లీ పోలీసులు ఫిర్యాదులు అందుకొన్న షాపుల్లో తనిఖీలు చేశారు. బ్రతుకుదేరువు కోసం వరంగల్ కు వచ్చిన ఓ వర్గం వారు ప్రముఖ బ్రాండ్స్ పేర విక్రయాలు చేస్తూ మోసాలు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
అలాగే బ్రాండెడ్ కంపెనీలకు సమాచారంను కొందరు వ్యాపారులు చేరవేశారు. దాంతో సదరు బ్రాండెడ్ కంపెనీలు ఢిల్లీ పోలీసులకు వరంగల్ వ్యాపారుల చీటింగ్ దందా ఫిర్యాదులు చేశారు. పెద్ద ఎత్తున ప్రముఖ బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్న (విక్రయానికి సిద్దేంగా ఉన్న) నకిలీ వస్త్రాలను ఢిల్లీ పోలీసులు రెడ్ హ్యాండెడ్(red-handed)గా పట్టుకొన్నారు. నాణ్యత లేని వస్త్రాలకు బ్రాండెడ్ స్టికర్స్ వేసి ధర తక్కువంటు మోసాలు చేస్తున్న బాగోతం బయట పడింది.ఢిల్లీ పోలీసులు
డూప్లికేట్ బ్రాండ్లను గుర్తించారు.
బ్రాండెడ్ కంపెనీల ఇమేజ్ డ్యామేజీ చేసే విషయంపై ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)ను ఓ మల్టినేషనల్ కంపెనీ యజమానులు ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసు బృందం, అడ్వకేట్‌లతో కలిసి వరంగల్ పోలీసులతో కలసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ముఖ్యంగా ప్రముఖ వస్త్ర వ్యాపారి చేసే దందాపై ఢిల్లీ పోలీసు బృందం దృష్టిని సారించినట్లు తెలుస్తోంది.
