Delhi | రేప‌టి నుంచి రెండు రోజులు ఢిల్లీలో చంద్ర‌బాబు

కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభలో పాల్గొననున్న సీఎం

వెల‌గ‌పూడి – ఏపీ సీఎం చంద్రబాబు (ap cm chandrababu) రేప‌టి నుంచి రెండు రోజులు (two days ) ఢిల్లీలో ( Delhi ) పర్యటించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah ) సహా పలువురు కేంద్ర మంత్రులతో మంగళ, బుధవారాల్లో ఆయ‌న భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభ, సీఐఐ బిజినెస్ మీట్‌లో చంద్రబాబు పాల్గొననున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తదితరులతో ఢిల్లీ పర్యటనలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా వేర్వేరు అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన పనుల గురించి కూడా ఆయా మంత్రిత్వ శాఖతో సీఎం చర్చలు చేయనున్నారు.

ఢిల్లీ షెడ్యూల్ ఇదే ..
ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అదే రోజు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ చంద్రబాబు సమావేశం అవ్వనున్నారు. రేపు సాయంత్రం 4.30కు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరుగనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు.

కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో బుధ‌వారం సమావేశం కానున్నారు. నార్త్ బ్లాక్లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా అదే రోజు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఎల్లుండి సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్‌కు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు 17వ తేదీ ఉదయం 9.30కు ఢిల్లీ నుంచి అమరావతి రానున్నారు.

Leave a Reply