Delhi | కేజ్రీవాల్ మెడ‌కు మ‌రో ఉచ్చు.. శీష్ మహల్ అవ‌త‌వ‌క‌ల‌పై విచార‌ణ‌

ఉత్త‌ర్వులు జారీ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : ఇప్ప‌టికే లిక్క‌ర్ స్కామ్ కేసులో ఉన్న ఢిల్లీ మాజీ సీఎం, అప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మెడ‌కు మ‌రో ఉచ్చు త‌గులుకోబోతున్న‌ది. సీఎంగా ఉండగా ఆయ‌న నివాసం ఉన్న శీష్ మహల్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేంద్ర ప్రజా పనుల విభాగం సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

శీష్ మహల్ దాదాపు 8ఎకరాల విస్తీర్ణంలో ఉంది. బంగ్లా పునరుద్ధరణకు ఆప్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. శీష్ మహల్ కు పొరుగున ఉన్న నాలుగు ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా విలీనం చేసి విలాసవంతమైన శీష్ మహల్ ను విస్తరించారని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా ఆరోపించారు.

ఆ ఆస్తుల విలీనాన్ని రద్దు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ కు లేఖ రాశారు. శీష్ మహల్ అంశం కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ను దారుణంగా దెబ్బతీసింది. ఆప్ పై అవినీతి ఆరోపణలు బీజేపీని అధికారాన్ని కట్టబెట్టాయని రాజ‌కీయ నాయ‌కులు విశ్లేష‌ణ‌.

Leave a Reply