Delhi | ఛాతిలో గన్ పెట్టుకొని…

Delhi | ఛాతిలో గన్ పెట్టుకొని…

Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఓ ఫ్రెండ్ వీడియో రికార్డ్ చేస్తుండ‌గానే.. ఢిల్లీలో ఓ వ్య‌క్తి గ‌న్‌తో త‌న ఛాతిలో కాల్చుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ లో పవన్ అనే యువకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే పిస్తోల్ కి లైసెన్స్ ఉందని, అది వీడియో తీస్తున్న వ్యక్తిదే అని సమాచారం.

ఒళ్లు జ‌ల‌ద‌రించేలా ఉన్న వీడియోలో.. ఓ వ్య‌క్తి పిస్తోల్‌లోని మ్యాగ్జిన్ లోడ్ చేశాడు. ఆ త‌ర్వాత ఆ వెప‌న్‌ను త‌న ఛాతిలో పెట్టుకుని ట్రిగ్గ‌ర్ నొక్కాడు. మ్యాగ్జిన్‌లోకి ఎలా బుల్లెట్ పెట్టారో వీడియో తీస్తున్న వ్య‌క్తి చెప్పాడు. బ‌ట‌న్ క్లిక్ చేస్తే అది లోప‌లికి వెళ్తుంద‌ని పేర్కొన్నాడు. చూడ‌టానికి ఫిట్‌గా ఉన్న వ్య‌క్తి.. సైలెంట్‌గా గ‌న్ తీసి త‌న ఛాతిలో కాల్చుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ స‌మ‌యంలో వీడియో తీస్తున్న వ్య‌క్తి ఫైరింగ్ చేయ‌వ‌ద్దన్నా… కానీ కొన్ని క్ష‌ణాల త‌ర్వాత ఆ వ్య‌క్తి గ‌న్‌ను ఛాతిలో ఎడ‌మ‌వైపు పెట్టుకుని కెమెరాకు స్మైల్ ఇస్తూ ట్రిగ్గ‌ర్‌ను స‌డెన్‌గా నొక్కేస్తాడు. అత‌ని శ‌రీరం నుంచి ర‌క్తం చిందే మూమెంట్ కూడా వీడియోలో కనిపిస్తుంది. కాల్చుకున్న యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply