మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
ఓడరేవు బీచ్ లో ఐదుగురు మృతి ఘటనపై తీవ్ర విచారం

ఆంధ్రప్రభ, బాపట్ల ( కలెక్టరేట్) చీరాల లోని వాడరేవు సముద్రతీరంలో గల్లంతైన యువకుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశం ముగించుకొని నేరుగా వాడరేవుకు కలెక్టర్ చేరుకున్నారు.

చీరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు ను అడిగి మృతుల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చీరాల మండలం వాడరేవు బీచ్ లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.

ఇద్దరు హైదరాబాదీలు కాగ మరొకరు జడ్చర్లకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు. మరో ఇద్దరు వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన విద్యార్థులని ఆర్డీవో చంద్రశేఖర్ తెలిపారు. అమరావతిలోని వీవీఐటీ కాలేజీలో చదువుతున్న సాయి మణిదీప్, జీవన్ సాత్విక్, సాకేత్, మృతదేహాలు ఒడ్డుకు చేరుకున్నాయి.

చీరాల వడ్డెర సంఘానికి చెందిన కుచ్చిన షారోన్, కోట గౌతమ్ దేహాల కొరకు గాలింపు చర్యలు చేపట్టారు రాత్రి 12 గంటలకు కలెక్టర్ చేరుకొని అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు వారి కుటుంబ సభ్యులకు నా ప్రకార సానుభూతి ప్రకటిస్తున్న అన్నారు. బీచ్ వద్ద ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా పెట్టి భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply