ప్రజా సేవకు అంకితం
మక్తల్ , ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ స్పూర్తితో ప్రజా సేవకు అంకితం అవుతున్నానని, రాష్ట్ర పశుసంవర్థక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Dr. Vakati Srihari) అన్నారు. మక్తల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింస మార్గంలోనే దేశానికి స్వాతంత్రం సాధించిపెట్టిన మహాత్ముడి ఆశలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. గాంధీ స్పూర్తితో తెలంగాణ (Telangana) అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ( Arya Vaishya Sangham Leaders) కొత్త శ్రీనివాస్ గుప్తా, కట్ట సురేష్ కుమార్ , కొత్త జగదీష్ , బి .భాస్కర్ , మనసాని వెంకటేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జి. గోపాల్ రెడ్డి, బి.గణేష్ కుమార్, బోయ రవికుమార్ ,ఫయాజ్, జి .నరసింహారెడ్డి, గాయత్రి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొని మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

