తిరుమల – తిరుమలలో పరిపాలన భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు టిటిడి పాలకమండలి సభ్యులు . పాత భవనాలని తొలగించి వాటి స్థానంలో నూతన భవన నిర్మాణాాలు చేపట్టాలనే ప్రతిపాదనను బోర్డు ఆమోదించింది.. తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి నేడు సమావేశమైంది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణంపై చర్చించామని… కమిటీ నివేదిక మేరకు ఈ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సామాన్య భక్తులకు అదనంగా వసతి సదుపాయలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అలిపిరి వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు ఓ కమిటీని నియమించనున్నట్లు ప్రకటించారు.
TG | కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ .. కెసిఆర్ కిట్ల పంపిణి
ఒంటిమిట్ట ఆలయంలో త్వరలోనే అన్నదానం ప్రారంభించనున్నారు. రూ. 4.7 కోట్లతో అన్నదానం కోసం నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు. 320 ఆలయాలకు మైక్ సెట్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 700 మంది వేద పారాయణదారుల నియామకానికి ఆమోదం తెలిపారు. ఇందుకోసం రూ.18కోట్ల నిధులు కేటాయించనున్నారు. 600 మంది వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఆమోదించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఏపీలోని పలు దేవాలయాల వద్ద భజన మండలాల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.
శిలాతోరణం, చక్రతీర్ధం అభివృద్ధి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణ అధ్యాయనానికి ఓ కమిటీ వేయనున్నట్లు వివరించారు. శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసే విధంగా కో ఆర్డినేటర్ల నియామకానికి ఆమోదం తెలిపారు. సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదించారు. కల్యాణకట్టల వద్ద పారిశుద్ధ్యం పెంపునకు కూడా ఆమోద ముద్ర వేశారు.
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు

టీటీడీలోని 142 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యూలైజ్ చేసి, ప్రభుత్వ ఆమోదానికి పంపాలని బోర్డు కీలక నిర్ణయం
తిరుమలలో 3వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించాల్సిన ఆవశ్యకత పై కన్సల్టెన్సీ తో కూడిన కమిటీ ఏర్పాటు
తిరుమలలో భక్తుల వేచిఉండేందుకు అనువైన నిర్మాణాలు ఎలా చేయాలనే దానిపై కన్సల్టెన్సీ నియాకం
అలిపిరి వద్ద ఆధ్యాత్మిక భావన మరింత పెంపొందించేలా, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన అభివృద్ధి పై కన్సల్టెన్సీ నియామకం
టీటీడీలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను నివారించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా పరిపాలన భవనం నిర్మించాలని నిర్ణయం ..
ఒంటిమిట్ట కోదాండరామాలయంలో పూర్తిస్థాయిలో అన్నప్రసాద వితరణకు రూ 4.35 కోట్లు నిధులు మంజూరు
ఆగష్టు నెల నుండి మూడుపూట్ల ఒంటిమిట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ
700 మంది వేదపారాయణదారులు నూతగ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం
దేవాదాయ శాఖ సిఫార్సు ప్రకారం 600 మంది వేదపారాయదారులకు నిరుద్యోగభృతి క్రింద నెలకు రూ 3 వేలు అందించాలని నిర్ణయం
ఎస్సీ,ఎస్టీ, వెనుకబడిన ప్రాంతాల్లో మూడు కేటగిరీల్లో భజనమందిరాలు నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్ట్ నిధులు విడుదల
కడపలో వేల సంవత్సరాల చరిత్ర గల శివాలయం అభివృద్దికి నిధులు మంజూరు
టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు కామెంట్స్

ఏఐ టెక్నాలజీ అమలుకు విధానపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి….సమస్యలు అధిగమించడంపై రెండు ప్రముఖ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి.
త్వరలో ఏఐ అమలు చేసి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పిస్తాం
హిందూయేతర ఉద్యోగులపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది…అన్యమత ఉద్యోగుల పై నిఘా పెట్టాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు
టీటీడీ నియమ నిబంధనలు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం