Tragic incident | తల్లి, ఇద్దరు కూతుళ్ల మృతి

Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హనుమకొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్ గ్రామానికి చెందిన ఫర్హత్, ఆమె కూతుళ్లు ఉమేరా, అయేషాలు గురువారం స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు సమాచారం.

పున్నెల్ క్రాస్ సమీపంలోని ఓ వెంచర్ వద్ద తండ్రి అజారుద్దీన్ వారిని వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం తిరిగి వచ్చేసరికి తల్లీకూతుళ్లు మృతి చెందినట్లు గుర్తించారు. కూతురు పుట్టినరోజు సందర్భంగా వారిని అక్కడికి తీసుకెళ్లినట్లు అజారుద్దీన్ చెబుతున్నాడు.

అయితే ఈ ఘటనపై మృతురాలి బంధువులు భర్త అజారుద్దీన్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన ఐనవోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటననా, లేక పూర్వ ప్రణాళికతో జరిగిన హత్యనా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply