హిమాచల్ ప్రదేశ్, బిలాస్‌పూర్ : బిలాస్‌పూర్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియ (landslide) ఒక్కసారిగా విరిగి పడటంతో ఒక టూరిస్ట్ బస్సు ధ్వంసమైంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న కమిటి 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
మరికొంతమంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ టూరిస్టు బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, సహాయ చర్యలు ప్రారంభించారు. పోలీసులు మృతదేహాలు.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తూ, బస్సు శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారేమోనని పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మరింత పెరుగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.