Death | విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి..

Death | రేగొండ, ఆంధ్రప్రభ : విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి చెందిన సంఘటన రేగొండ మండలం (ఆర్ జీ) తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అజ్మీర రుప్లా నాయక్ (75) పంటకు నీరు అందించే క్రమంలో అకస్మాత్తుగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన రూఫ్లా నాయక్ కుటుంబ సభ్యులను రామన్నగూడెం సర్పంచ్ గుగులోతు రవళిక- వీరునాయక్ పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.

Leave a Reply