DCC President | బట్టు కరుణాకర్ కు అభినందనలు

DCC President | రేగొండ, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా నూతన కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులుగా బట్టు కరుణాకర్ (Battu Karunakar) నియామకం కావడంతో బుధవారం రేగొండ మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు (Gandra Satyanarayana Rao) తో కలిసి అభినందించారు. విద్యావంతుడైన యువ కిరటం బట్టు కరుణాకర్ మొదటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ యూత్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికల ముందు నుంచి కొనసాగుతున్నాడు.

జిల్లాలో కాంగ్రెస్ (Congress) పార్టీ పట్ల యువతను ఆకర్షితులను చేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన అతన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి జిల్లా అధ్యక్షులుగా బట్టు కరుణాకర్ కి పదవీ బాధ్యతలు అప్పగించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు అభినందించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (MLA Gandra Satyanarayana Rao) క్యాంప్ ఆఫీసులో డీసీసీ అధ్యక్షులు కరుణాకర్ ను ఉమ్మడి రేగొండ మండల పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, జిల్లా నాయకులు మోడెం ఉమేష్ గౌడ్, ఎన్ఎస్ఆర్ సంస్థల చైర్మన్, నాయకులు నాయినేని సంపత్ రావు, మాజీ జడ్పిటిసి పత్తి ప్రభాకర్ కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కరుణాకర్ ను అభినందించిన వారిలో ఎమ్మెల్యే జీఎస్సార్ సైతం ఉండడంతో కరుణాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply