ఢిల్లీ : రాజస్థాన్‌తో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేసింది. సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఢిల్లీ అద్భుతంగా రాణించింది. సూపర్ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన డీసీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అయితే, 189 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన రాజస్థాన్ కూడా 20 ఓవర్లు ఆడి 4 వికెట్లు కోల్పోయి సరిగ్గా 188 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ జరిగింది. ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతంగా డిఫెండ్ చేసి ఒక వికెట్ తీస టైను సాధించాడు.
సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేయగా… హెట్మేయర్ (5 బంతుల్లో 7 నాటౌట్) – రియాన్ పరాగ్ (2 బంతుల్లో 4), జైస్వాల్ (0) కలిసి 11 పరుగులు సాధించారు. ఇక 12 పరుగుల లక్ష్యంతో సూపర్ ఓవర్లో ఛేజింగ్ కు దిగిన డీసీ బ్యాటర్లు కేఎల్ రాహుల్(3 బంతుల్లో 7 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (1 బంతికి 6) దంచేశారు దీంతో మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేప్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. ఢిల్లీ.. బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ పోరెల్ (49) రాణించగా.. కేఎల్ రాహుల్ (38), కెప్టెన్ అక్షర్ పటేల్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఆకట్టుకున్నారు. దాంతో ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో జాఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టగా, మహేష్ తీక్షన, వనిందు హసరంగా తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ఇక 189 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ కూడా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 సాధించింది. ఓపెనర్ జైస్వాల్ (51), నితిష్ రాణా (51) అర్ధ శతకాలతో రాణించారు. కెప్టెన్ సంజూ (31), ద్రువ్ జురేల్ (26) ఆకట్టుకున్నారు. షిమ్రాన్ హెట్మెయర్ (15) నాటౌట్‌గా నిలిచాడు.
ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.