ఐపీఎల్ 2025లో భాగంగా నేడు ఢిల్లీ వేదికగా జరుగుతన్న మ్యాచ్ లో రాజస్థాన్ – ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ.. ఆదిలోనే షాక్ తగిలింది. 2.3 ఓవర్లోనే ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (9) ఔటవ్వగా.. గత మ్యాచ్ లో ముంబై 89 అర్ధశతకంతో చెలరేగిన కరుణ్ నాయర్ (0) ఈ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు.
దీంతో ఢిల్లీ జట్టు నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు సాధించింది ఢిల్లీ జట్టు.
ప్రస్తుతం క్రీజులో అభిషేక్ పోరెల్ (40) – కేఎల్ రాహుల్ (27) ఉన్నారు.