- 10 ఓవర్లకు ఎంఐ స్కోర్ ఎంతంటే
ఢిల్లీ : ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై.. ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదర్కుంటూ బౌండరీలు దంచికొడుతొంది.
రోహిత్ శర్మ (12 బంతుల్లో 18) మరోసారి నిరాశపరిచినా.. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (25 బంతుల్లో 41) మాత్రం పవర్ ప్లేలో చెలరేగాడు. వీరిద్దరూ ఔటన తరువాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (19) – తిలక్ వర్మ (13) పార్ట్‌నర్‌షిప్ బిల్డ్ చేస్తున్నారు.
దీంతో 10 ఓవర్లకు ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు నమోదు చేసింది.