- ఢిల్లీ క్యాపిటల్స్ ఎంమై థ్రిల్లింగ్ విక్టరీ
ఢిల్లీ : ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఢిల్లీని వారి సొంత గ్రౌండ్ లో ఢీకొన్న ముంబై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ… ప్రారంభంలో అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు విధ్వంసం సృష్టించినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లు పుంజుకోవడంతో ఢిల్లీ కుప్పకూలింది.
19వ ఓవర్లో బుమ్రా చివరి మూడు బంతుల్లో ముగ్గురు ఆటగాళ్లు రనౌట్ అయ్యారు. దాంతో ఢిల్లీ 193 పరుగులకు ఆలౌటైంది. దీంతో, ఈ సీజన్‌లో అపజయం లేని జట్టుగా కొనసాగిన ఢిల్లీ.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరుతో తొలి ఓటమిని రుచి చూసింది.
ఈ విజయంతో 9వ స్థానంలో ఉన్న ముంబై 7వ స్థానానికి చేరుకుంది. ఇక ఢిల్లీ జట్టు రెండో స్థానానికి పడిపోయింది.
కాగా, 206 పరుగలు ఛేదనలో తొలి బంతికే వికెట్ పడినా.. ఆ తరువాత వచ్చిన కరుణ్ నైర్ (40 బంతుల్లో 89) అదిరే అర్దశతకం బాదాడు. ఓపెనర్ అభిషేక్ పోరేల్ (33) రాణించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 119 పరుగులు జోడించారు.
కరుణ్ సృష్టించిన విధ్వంసానికి ఢిల్లీకి మరో విజయం ఖాయమని అంతా భావించారు. అయితే, వీరు ఔటన తరువాత.. ఢిల్లీకి ఫేవర్ గా ఉన్న మ్యాచ్ ముంబై వైపు మల్లింది. మిడిలార్డర్ బ్యాటర్లు స్వల్ప పరుగులకే పెవిలియన్ కు క్యూ కట్టడంతో మ్యాచ్ ఢిల్లీ చేజారింది.
ఇక ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ మూడు వికెట్లతో మెరిశాడు. మిచెల్ సాంట్నర్ రెండు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, బుమ్రా తలా ఒక వికటె దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్ లో అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై.. ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదర్కుంటూ బౌండరీలు దంచికొట్టింది. రోహిత్ శర్మ (12 బంతుల్లో 18) మరోసారి నిరాశపరిచినా.. తిలక్ వర్మ (33 బంతుల్లో 59) అర్థ శతకంతో చెలరేగాడు. ఓపెనర్ ర్యాన్ రికల్టన్ (25 బంతుల్లో 41), సూర్య కుమార్ యాదవ్ (28 బంతుల్లో 40), నమన్ ధీర్ (17 బంతుల్లో 38 నాటౌట్) కూడా రాణించారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీపై ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగలిగింది.