ఆరు తులాల బంగారం చోరీ!

బాల్కొండ /మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ (Nizamabad) జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కేంద్రంలో ఈ రోజు పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఒక ఇంట్లో చొరబడి సుమారు ఆరు తులాల బంగారం (gold), పది తులాల వెండి, రూ.30 వేలతో సహా రూ.7.5 లక్షల విలువైన సొత్తును దుండ‌గులు చోరీ చేశారు.

మెండోరా (Mendora) కు చెందిన మేర రామకృష్ణ తన భార్యతో కలిసి టైల‌ర్‌ షాపునకు వెళ్లారు. అదే సమయంలో, వారి కుమారుడు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తాళం పగులగొట్టి ఉండటం చూసి అతను షాక్‌కు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న రామకృష్ణ (Ramakrishna), ఆయన సతీమణి హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. లోపల పరిశీలించగా, ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం, పది తులాల వెండి, మరియు రూ.30 వేల నగదు కనిపించలేదు.

స‌మాచారం అందుకున్న ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై సుహాసిని తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దొంగలు (Thieves) తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన తీరును పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించి, వివరాలు సేకరించారు. దొంగలను త్వరలో పట్టుకుంటామని, తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply