ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభానికి ఐదు రోజుల ముందు ఆర్‌సిబి అన్‌బాక్సింగ్ ఈవెంట్ జరగనుంది. ఆర్సీబీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అన్‌బాక్సింగ్ ఈవెంట్ మార్చి17న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుండగా.. ఈ ఈవెంట్ కి సంబంధించిన టికెట్లను యాజమాన్యం ఆన్‌లైన్‌లో ఉంచింది.
ఆర్సీబీ అన్‌బాక్సింగ్ ఈవెంట్ లో జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించనున్నారు. దాంతో పాటు ఈ ఈవెంట్ లో ఆర్‌సిబి మాజీ ఆటగాళ్లకు హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులతో సత్కరిస్తుంది యాజమాన్యం. అయితే, గత రెండు సీజన్లలో క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్, వినయ్ కుమార్ ఆర్‌సిబి హాల్-ఆఫ్-ఫేమ్ లో చోటు దక్కించుకోగా.. ఈసారి ఈ అవార్డు ఎవరికి వస్తుందో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. దీనికి సమాధానం మార్చి 17న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దొరుకుతుంది.