హనుమ వాహనంలో దర్శనం
తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు సోమవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు(Seshachaladhisa) శ్రీ కోదండ రాముడి అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై(on Hanuman) ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు(camphor aartis) సమర్పించి స్వామిని దర్శించుకున్నారు.
హనుమంత వాహనం – భగవత్ భక్తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు(Anjaneya) వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథంపై శ్రీమలయప్ప స్వామి(Srimalayapa Swami) భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.






