- అధికారులు పట్టించుకునేది ఎప్పుడు..?
దండేపల్లి, (ఆంధ్రప్రభ): దండేపల్లి మండలంలోని మెదరిపేట బస్టాండ్ సమీపంలోని ఎస్ కె సర్దార్ ఇంటి ముందు వేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికీ ఎన్నోసార్లు విద్యుత్ అధికారులకు మొరపెట్టున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు.
అయితే.. ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. అక్కడే సైకిల్ రిపేర్ షాపు పెట్టుకుని జీవనోపాధి పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. టాన్స్‌ఫార్మ ర్లను చూస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రతిరోజు బిక్కు బిక్కుమంటు కాలం వెళ్లదీస్తున్నారు. విద్యుత్‌శాఖ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల స్థంభాల ఇనుప చువ్వలు బయట పడ్డాయి. ఇవి కూలితే పెను ప్రమాదం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే ట్రాన్స్‌ఫార్మర్లను వేరే చోటుకు మార్చాలన్నారు.
గతంలో దండేపల్లి సబ్ స్టేషన్ లో రాతపూర్వకంగా ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పుడు తీస్తాం.. అప్పుడు తీస్తాం అనడమే తప్పా తీసేది లేదన్నారు. ఇప్పటి వరకు కొంతమంది విద్యుత్ అధికారులకు డబ్బులు కూడా చెల్లించామని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇక్కడి ట్రాన్స్ఫార్మర్ వేరే చోటికి మార్చి మమ్మల్ని రక్షించండి అని మొరపెట్టుకుంటున్నారు.

