కరెంట్ స్తంభాల వద్ద వెళ్తే ప్రమాదం..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఏపీ, తెలంగాణ (AP and Telangana) రాష్ట్రాల్లో వానలు (rains) దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు (electricity accidents) జరిగే అవకాశాలుంటాయి. జనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యుత్ శాఖ అధికారులు (electricity department officials) సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాకాలం (rainy season) కరెంట్ స్తంభాలకు (electric poles) దగ్గరగా అస్సలే నడవకూడదు. చేతులను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడమే కాకుండా, విద్యుత్ లైన్ల వద్ద అస్సలే బట్టలు ఆరబెట్టకూడదు. వర్షం పడి గాలి దుమారం, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ల (transformers) వద్ద లేదా సెల్ టవర్ల వద్ద లేదా చెట్ల కింద అస్సలే నిలబడకూడదు. వాటి దగ్గర స్మార్ట్ ఫోన్ (smart phone) కూడా యూస్ చేయకూడదు. మీరు వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగలు కిందికి వంగడం లేదా రోడ్డుపై పడినట్లు కనిపిస్తే వాటికి దూరంగా వెళ్లాలి. తడిచిన గోడలను లేదా, విద్యుత్ స్తంభాలను అస్సలే తాకకూడదు.
