Danam Nagender | ఊహించిన‌ట్టే..!

Danam Nagender | ఊహించిన‌ట్టే..!

  • తెలంగాణాలో మరో పొలిటికల్ హీట్
  • రాజీనామాకు దానం రెడీ
  • ఖైరాతాబాద్ ఉప ఎన్నిక‌కు సిద్ధం
  • గులాబీ బిగ్‌బాస్ ఎత్తుగ‌డ‌ల‌పై అంద‌రి దృష్టి

Danam Nagender | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ రాజీనామా(resignation)కు రెడీ అవుతున్నారు. రెండు రోజులుగా ఆయ‌న చేసిన వ్యాఖ్యల‌ను ప‌రిశీలిస్తే ఎవ‌రికైనా ఇట్టే అర్థ‌మ‌వుతుంది. పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొంటున్న దానం నాగేంద‌ర్ రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు(For the by-elections) సిద్ధం అవుతున్న‌ట్టు దాదాపు సంకేతాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో ఒక్క‌సారిగా రాజ‌కీయ‌వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఇప్ప‌టికే గులాబీ బిగ్‌బాస్ ప్ర‌భుత్వంపై పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ఉప ఎన్నిక‌లు వ‌స్తే మ‌రింత‌గా వాతావ‌ర‌ణం వేడెక్కుతుంద‌న‌డంలో సందేహం లేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress government) ఏర్ప‌డిన త‌ర్వాత హైద‌రాబాద్‌లో జ‌రిగిన రెండు ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేశారు. అయితే ఈ సారి గులాబీ బిగ్‌బాస్ ప్ర‌త్యేక్షంగా దిగితే బీఆర్ఎస్ జెండా ఎగుర వేయ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నారు. ఇదే స‌మ‌యంలో త‌న‌కు కార్య‌క‌ర్త‌లు అండ‌గా ఉన్నార‌ని, ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తాన‌ని దానం నాగేంద‌ర్ కూడా ధీమా(dhima) వ్య‌క్తం చేస్తున్నారు.

Danam Nagender | దానం రాజ‌కీయ ప్రస్థానం

Danam Nagender

ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ 1994లో ఆసిఫ్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి అసెంబ్లీ(Assembly for the first time)లో అడుగు పెట్టారు. అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1999, 2004లో ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు. తెలుగు దేశం టికెట్‌పై ఆసిఫ్‌నగర్ నుండి గెలిచారు. ఆయన ఆ స్థానానికి రాజీనామా(Resign the position) చేసి తిరిగి అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం, వైఎస్‌ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చోటు ద‌క్కించుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2014లో ఓట‌మి చూశారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023లో ఖైరాతాబాద్ నుంచి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి చేరి సికింద్రాబాద్(Secunderabad) ఎంపీగా పోటీ చేసి ఓట‌మి చ‌విచూశారు.

Danam Nagender | దానం స్ట్రాటజీ..

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్(Khairatabad) ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొంటున్న సంగ‌తి విదిత‌మే. ఈ క్ర‌మంలో తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని నిన్న ప్ర‌క‌ట‌న చేశారు కూడా! కావాలంటే తాను రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు వెళ్లి, భారీ మెజారిటీతో మ‌ళ్లీ గెలుస్తానని ధీమా కూడా వ్యక్తం చేశారు. రాజీనామా చేయడానికి, అవసరమైతే ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి తనకున్న ధైర్యం పార్టీ కార్యకర్తలే(Activists) అని అన్నారు.

Danam Nagender | ఊహలు గుస గుస

పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ పోరాటం(BRS Struggle) చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ న్యాయ‌పోరాటంతో పార్టీ మారిన ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగందేర్ ఇర‌కాటంలో ప‌డ్డార‌ని ప‌రిశీల‌కులు ఊహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్ల‌మెంట్‌కు పోటీ చేయ‌డంతో పార్టీ ఫిరాయింపు(Party defection) చ‌ట్టం వ‌ర్తిస్తుంద‌ని, అంత‌కు ముందే దానం నాగేంద‌ర్ రాజీనామా చేస్తార‌ని భావించారు. అదే జ‌ర‌గ‌బోతుంది! ఒక స్పీక‌ర్ వేటు నుంచి త‌ప్పించుకునే అవ‌కాశం లేదని, వేటు ప‌డితే ఆరేళ్లు పోటీ(Six years of competition) చేసే అవ‌కాశం ఉంద‌డ‌ని, అందుకే రాజీనామా త‌ప్ప‌నిస‌రి అని చ‌ర్చ కొన‌సాగింది.

Danam Nagender | తెర మీదకు ట్రై యాంగిల్ ఫైట్

ఖైరాతాబాద్ ఉప ఎన్నిక జ‌రిగితే మూడు పార్టీల‌కు ప్ర‌తిష్ఠాత్మ‌క‌మే(It is prestigious). కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్ల‌మెంట్‌లో ఖైరాతాబాద్ సెగ్మెంట్ ఒక‌టి. కాబ‌ట్టి ఇక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక బీజేపీ జెండా ఎగుర‌వేయ‌డానికి అహ‌ర్నిశ‌లు శ్ర‌మించాలి. ఇదీ బీజేపీతోపాటు కిషాన్‌రెడ్డి(Kishan Reddy)కి ప్ర‌తిష్ఠాత్మ‌కం. అలాగే అధికార కాంగ్రెస్ నుంచి దానం నాగేంద‌ర్ పోటీ చేస్తారు. ఇదీ దానం నాగేంద‌ర్‌తోపాటు , కాంగ్రెస్‌కు కూడా ప్ర‌తిష్ఠాత్మ‌క‌మే. ఖైరాతాబాద్ ఉప ఎన్నిక వ‌స్తే త‌మ పార్టీ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ కి కూడా ప్ర‌తిష్ఠాత్మ‌కమే!

Danam Nagender | పొలిటికల్ హీట్..

ప్ర‌స్తుతం రాష్ట్రంలో గులాబీ బిగ్‌బాస్ కేసీఆర్ రెండేళ్ల త‌ర్వాత ప్ర‌త్య‌క్ష రాజ‌కీయా(Direct politics)ల్లోకి వ‌చ్చారు. ఎ.రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై దాదాపు యుద్ధ‌మే ప్ర‌క‌టిస్తూ బీఆర్ఎస్ శ్రేణుల‌ను ఉత్తేజ‌ప‌రిచారు. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌రింత పెరిగింది. కేసీఆర్ పార్టీ శ్రేణుల‌ను(Party ranks) ఉత్తేజ‌ప‌రిచిన త‌ర్వాత ఒక్క‌సారి రాజ‌కీయ‌వాతావర‌ణం వేడెక్కింది. ఈ క్ర‌మంలో ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతే రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌నున్నాయి.

CLICK HERE TO READ విచార‌ణ‌కు హాజరైన నటుడు శివాజీ..

CLICK HERE TO READ MORE

Leave a Reply