Danam Nagender | సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేస్తా..

Danam Nagender | సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేస్తా..

  • ఎమ్మెల్యే దానం నాగేందర్

Danam Nagender | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో ఫైట్ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు(Interesting comments) చేశారు. ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని, ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని దానం అన్నారు. తనకి ఎన్నికలు కొత్త కాదని, ఇప్పటికి 11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర తనకి ఉందన్నారు. హిమాయత్ న‌గ‌ర్(Himayat Nagar) లో దానం ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply