Damodar Reddy | కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

Damodar Reddy | కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి

Damodar Reddy | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ : రెండవ విడతలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎమ్మెల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నాగర్ కర్నూల్ మండలంలోని గుడిపల్లి, పెద్దాపూర్, తుడుకుర్తి గ్రామాలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. గుడిపల్లి, పెద్దాపూర్, తోడుకుర్తి గ్రామాలలో జరిగిన సభలలో ఎమ్మెల్సీ (MLC) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రోడ్లు, లింకు రోడ్లు కూడా ఇస్తున్నామని, గ్రామస్థాయిలో సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి గెలిపిస్తే మ‌రింత అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు.

తాను 40 ఏళ్లుగా రాజకీయాలలో ఉంటూ సేవలందిస్తున్నానని, జిల్లా పరిషత్ చైర్మ‌న్‌గా ఉన్న సమయంలో గుడిపల్లి గ్రామ హైస్కూల్ (Highschool) నిర్మించడానికి నిధులు ఇచ్చానని, గుడికి కూడా రూ.50 లక్షలు మంజూరయ్యాయని, ఇంకా కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పెద్దాపూర్ గ్రామంలో కూడా సంబంధిత రోడ్లు, ఇండ్లు, పెన్షన్లు అమలు చేస్తామన్నారు. తూడుకుర్తి గ్రామంలో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి పనులను చేపడుతున్నామని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మీ కరుణాకర్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.

Leave a Reply