దమ్మపేట విద్యార్థినికి స్టేట్ ర్యాంక్

దమ్మపేట, ఆంధ్రప్రభ ; తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో దమ్మపేట విద్యార్థిని దారా చైత్ర స్టేట్ ర్యాంకు సాధించారు . హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్న దమ్మపేటకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త దారా చంద్రశేఖర్ -హారిక దంపతుల రెండవ కుమార్తె దారా చైత్ర ఇంటర్ ప్రథమ ఎంపీసీ లో 468/470 స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది.
దమ్మపేట విద్యార్థిని స్టేట్ ర్యాంక్ సాధించటం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపక బృందం ,దమ్మపేట మండల మాజీ జెడ్పిటీసి పైడి వెంకటేశ్వరరావు , దమ్మపేట మాజీ వైస్ ఎంపీపీ , వాసవీ క్లబ్ అంతర్జాతీయ సమన్వయకర్త దారా మల్లిఖార్జునరావు , దమ్మపేట మాజీ ఉప సర్పంచ్ దారా యుగంధర్ ,దమ్మపేట మండల, పట్టణ అధ్యక్షులు పసుమర్తి రామభద్రం ,దారా వీర వెంకట నాగ సత్య కృష్ణ ప్రసాద్ ( డీపీ ), ఆర్యవైశ్య ప్రముఖులు , దమ్మపేట మండల , పట్టణ ప్రముఖులు విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు .
