దామరచర్ల మండలం వీర్లపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని యం శ్వేత పదో తరగతి ఫలితాలలో 600 మార్కులు గాను 517 మార్కులు మండల స్థాయి లో ఉత్తమ మార్కులు సాధించి ఉత్తమ విద్యార్థిని గా నిలిచింది. వీర్లపాలెం గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసినప్పటి నుండి ఈ స్థాయి లో ఉత్తమ మార్కులు రావడం ఇదే ప్రధమంఅని ఉపాధ్యులు, విద్యార్థిని ని అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థిని మల్రెడ్డి శ్వేతా మాట్లాడుతూ తనకు అత్యధిక మార్కులు రావడానికి తన పట్టుదల తోపాటు తమ పాఠశాల ఉపాధ్యాయుల కృషిసహకారం చాలా ఉంది అనితెలిపిందిపల్లె లో విద్యాభ్యాసం అయినా కూడా తమ తల్లీ దండ్రులు చాలా ప్రోత్సాహం అందించారు అని తన ఉత్తమ మార్కులు రావడానికి సహకరించిన అందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు అని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ తమ పాఠశాలలో విద్యాబోధన ఉండడం వల్ల మాలాంటి నిరుపేద విద్యార్థులకు ఎంతో నాణ్యమైన విద్యను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపింది
అధ్యాపక బృందం మాట్లాడుతూతమ పాఠశాల విద్యార్థులు నూటికి నూరు శాతం పదవతరగతి లో ఉత్తీర్ణత సాధించారు అనియం. శ్వేతా 517 మార్కులు రాగా గణేష్ 495,దత్తు 465 మార్కులతో ఉత్తమ స్థానాలు సాధించారు అని తెలిపారు. తమ విద్యార్థుల ఫలితాలతో తమలో మరింత పట్టుదల పెరిగింది అని వచ్చే ఏడాది లో జిల్లా స్థాయి ఉత్తమ మార్కులు సాధించేందుకు కృషి చేస్తాం అని ప్రధాన ఉపాధ్యాయులు పుష్పలత, ఉపాధ్యాయులు బాలునాయక్, సారయ్య,రాధా, కాశీ యాదవ్ ఉపాధ్యాయ బృందం తెలియచేసారు.