Daku Maharaj | ఓటీటీలో డాకు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !?

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ – బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’. జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ‘డాకు మహారాజ్’ ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

కాగా, ప్ర‌స్తుతం బాలకృష్ణ ‘అఖండ-2’ షూటింగ్ లో కూడా బిజీగా ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం, ‘అఖండ’ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *