Dairy Festival | కనుమ పండగ విశిష్టత ఇదే..

Dairy Festival | కనుమ పండగ విశిష్టత ఇదే..
Dairy Festival | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సంక్రాంతి పండగ మూడు రోజుల సంబరాల్లో చివరి రోజు అయిన కనుమను తెలుగు రాష్ట్రాల్లో పశువుల పండగ లేదా పాడి పశువుల పండగ (Festival) అని కూడా పిలుస్తారు. ఇది కేవలం ఒక పండగ కాదు… రైతన్నల హృదయం.. కృతజ్ఞత.. ప్రకృతి పట్ల గౌరవం.. జీవన వ్యవస్థలో పశువుల పాత్రను గుర్తు చేసే అద్భుతమైన సందర్భం. అందుకనే ఈ మూడు రోజుల పండగల్లో కనుమ ప్రత్యేకం.

Dairy Festival | కనుమ పండగకు ముఖ్య విశిష్టతలు ఏంటంటే..
సంవత్సరం అంతా వ్యవసాయంలో, పొలాల్లో, ఇంటి పనుల్లో పశువులు రైతులకు (Farmer) అత్యంత సన్నిహితంగా ఉంటాయి. వాటి శ్రమ లేకుండా పంటలు పండడం కష్టం. అందుకే.. కనుమ రోజున పశువులకు విశ్రాంతి ఇచ్చి, వాటిని దైవంగా పూజిస్తారు. గోవర్ధన గిరి పురాణ కథలో.. శ్రీకృష్ణుడు గోకులవాసులను ఇంద్రుని పూజించకుండా గోవర్ధన గిరిని పూజించమని చెప్పాడు. అప్పుడు కోపంతో ఇంద్రుడు కుండపోత వర్షం కురిపించగా… కృష్ణుడు తన భక్తులను, పశువులను కాపాడాడు. ఈ ఘటన స్మరణార్థమే కనుమ పండగ ప్రధానంగా జరుపుకుంటారు అని పెద్దలు చెబుతుంటారు.

Dairy Festival | కనుమ రోజు సాంప్రదాయ ఆచారాలు..
ఉదయాన్నే పశువులకు తలంటు స్నానం చేయించడం.. కాళ్లకు మువ్వలు, మెడలకు గజ్జెలు, నుదుటికి పసుపు-కుంకుమ పెట్టడం.. కొమ్ములకు రంగులు వేసి, పూల మాలలు, అలంకరణలు చేయడం.. ఇంటి ముందు గోమాతకు పూజ చేసి, ప్రసాదాలు సమర్పించడం చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో గోశాలలకు తీసుకెళ్లి గోపూజ చేయడం.. సాయంత్రం కుటుంబంతో కలిసి పిండి వంటలు (Pastries) తినడం చేస్తుంటారు.

Dairy Festival | కనుమ రోజున ప్రయాణాలు చేయకూడడా…?
కనుమ (Kanuma) రోజున ప్రయానాలు చేయకూడదు అంటారు. ఎందుకంటే.. ఈ రోజు పశువులకు, కుటుంబానికి, ఇంటికి పూర్తిగా సమర్పించాలనే భావన ఉంది. అందుకే కాకులు కూడా కదలని పండగ అని కూడా పిలుస్తారు.
- కనుమ పండగ అంటే…
- కేవలం సంబరాలు కాదు..
- కృతజ్ఞత చెప్పుకోవడం..
- ప్రకృతిని గౌరవించడం..
- పశువులను దైవంగా భావించడం..
- అనే గొప్ప సంస్కృతి మన తెలుగు జీవన విలువల్లో ఒక అందమైన భాగం. ఈ కనుమ పండగ మనందరికీ సుఖ-సంతోషాలు, సమృద్ధి, ప్రకృతి పట్ల ప్రేమ తెచ్చిపెట్టాలని కోరుకుందాం. అందరికీ.. కనుమ పండగ శుభాకాంక్షలు..
