Cyclone | భయంకరమైన ఉరుములు, మెరుపులు..

Cyclone | భయంకరమైన ఉరుములు, మెరుపులు..

Cyclone, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : దిత్వా తుఫాను కారణంగా మంగళవారం రాత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (Nellore) జిల్లాలో భయంకరమైన ఉరుములు మెరుపులు ప్రజల్లో భయాన్ని సృష్టించాయి. పిడుగులతో జిల్లా ప్రజలు భయకంపితులయ్యారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి వాన తగ్గి ప్రశాంతంగా ఉన్న వాతావరణంతో తుఫాను వెళ్ళిపోయినట్లే ప్రజలు భావించారు. అయితే.. రాత్రి భారీ వర్షాలతో జిల్లా, మరీ ముఖ్యంగా నెల్లూరు నగరం జలమయంగా మారింది. తదుపరి అర్థరాత్రికి ఉరుములు, మెరుపులు, శబ్దాలతో పిడుగులు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. బుధవారం ఉదయానికి మరలా పరిస్థితి ప్రశాంతంగా మారింది.

Leave a Reply