CSK vs MI | టాస్ గెలిచిన చెన్నై !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఈరోజు చిదందరామ్ స్టేడియంలో జరగనుంది. అభిమానులు ‘ఎల్ క్లాసికో’ గా అభివర్ణించే చెన్నై-ముంబై పోరు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.

ఐపీఎల్‌లో చెరో ఐదు ట్రోఫీలతో ఆధిపత్యం చెలాయిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌ను నేడు ఆడనున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ తో బరిలోకి దిగుతుంది.

తుది జ‌ట్లు :

ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్ (wk), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *