బీచ్‌లో దారుణం..

బీచ్‌లో దారుణం..
పూరి : స్నేహితుడితో కలిసి సరదాగా బీచ్‌కు(Beach Incident) వెళ్లిన 19 ఏళ్ల కాలేజీ యువతిపై గ్యాంగ్ రేప్ (gang-rape) జరిగింది. ఈ దారుణమైన(Crime) సంఘటన ఒడిశా(Odisha) రాష్ట్రంలోని పూరి(Puri) జిల్లాలో చోటు చేసుకుంది. బాధిత యువతి తన స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లింది. ఇది గమనించిన నలుగురు యువకులు వారిని వీడియో తీశారు.
అనంతరం వారి వద్దకు వెళ్లి.. ఆ వీడియో డిలీట్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో, వారిలో ఇద్దరు యువకులు ఆ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ చేయగా, మిగతావారు ఆమె స్నేహితుడిని బంధించారు. ఈ ఘటనతో బాధితురాలు తీవ్ర షాక్‌లోకి వెళ్లింది. దీంతో ఈ దారుణ ఘటనపై ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో కేసు నమోదు చేసుకున్నపోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్(Arrest) చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించారు. నిందితుల మొబైల్ ఫోన్లు సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. మరో నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు(Police Investigation). ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేప్‌గా, మహిళల భద్రతపై(Women Safety) మరోసారి చర్చలు మొదలయ్యాయి. బీచ్ ప్రాంతంలో భద్రత పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది.
