Crude Oil Prices Drop : ధర తగ్గిందోచ్​ Anshra Prabha News

Crude Oil Prices Drop : ధర తగ్గిందోచ్​ Anshra Prabha News

  • మార్కెట్లు హ్యాపీ హ్యాపీ
  • తగ్గిన క్రూడ్​ ఆయిల్​ ధర
  • అమెరికాలో $94.59
  • బ్రెంట్ ఫ్యూచర్స్ $92.35

( ఆంధ్రప్రభ, వాషింగ్టన్​ ప్రతినిధి)

Crude Oil Prices Drop : ఇరాన్, అమెరికా కాల్పుల విరమణ ప్రకటనతో మురు ధరలు తగ్గాయి. మార్కెట్లు పుంజుకున్నాయని, చమురు ధరలు తగ్గాయని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఇంతకీ కాల్పుల విరమణ నిలబడుతుందా లేదా అనే దానిపై ఎక్కువ నమ్మకం పెట్టుకోలేమని వాణిజ్య వర్గాలు అంటున్నాయి. ఈ కాల్పుల విరమణ నిలబడుతుందా లేదా అనే దానిపై ఇజ్రాయెలీలు, ఇరానీలు ఇతర పక్షాల నుండి వచ్చే సంకేతాలను గమనించడం కీలకం,” అని విశ్లేషకులు అంటున్నారు.

Crude Oil Prices Drop : “చర్చలలో చాలా అంతరం ఉండబోతోంది, మార్కెట్లు ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నాయి,” అని వ్యాపారులు అంటున్నారు. అవి కదిలినప్పటికీ, ఫిబ్రవరి చివరిలో ధరల కంటే చమురు ధరలు ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉన్నాయి,” అని వాపోతున్నారు. కాల్పుల విరమణ వార్తల తర్వాత యూఎస్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 16 శాతం తగ్గి బ్యారెల్‌కు $94.59కి పడిపోగా, బ్రెంట్ ఫ్యూచర్స్ కూడా 15 శాతం తగ్గి బ్యారెల్‌కు $92.35కి పడిపోయాయి.ఆసియా స్టాక్​ మార్కెట్లు ఖుషీ ఖుషీగా ఉంది. పాన్ నిక్కీ సుమారు 5 శాతం పెరగగా, దక్షిణ కొరియా కోస్పి 6 శాతం పెరిగింది, దీంతో ట్రేడింగ్‌ను నిలిపివేశారు.

Leave a Reply