పంట నష్టపరిహారం ఇవ్వాల్సిందే
- కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్
మోతె, ఆంధ్రప్రభ : రైతులు పండించిన పంటలకు నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా ఇవ్వాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్(Bollam Mallaiah Yadav) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు మోతె మండల పరిధిలోని సర్వారం గ్రామంలో ఇటీవల తుఫాన్ కారణంగా నేలమట్టమైన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలన చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. వర్షాల కారణాలతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కచ్చితంగా ఇవ్వాల్సిందే అని రైతులకు అత్యంత త్వరలోనే రైతు భరోసాని ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఐకెపి కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిన ధాన్యం రైతులు నష్టపోకుండా(Farmers do not suffer) తేమశాతం చూడకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. లేని ఎడల మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్, మిక్కిలినేని సతీష్ బాబు,జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, పల్స మల్సూర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

