గద్వాల (ప్రతినిధి), జూన్ 3 (ఆంధ్రప్రభ) : గద్వాల పట్టణంలో మొసలి కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని హమాలీ కాలనీలో ఉన్న ఓ ఇంటి ఆవరణలోకి మొసలి వచ్చింది. దానిని చూసి శునకాలు పెద్దపెట్టున మొరుగుతూ అనుసరిడంతో.. మేల్కొన్న స్థానికులు మొసలిని చూసి భయాందోళనలకు గురయ్యారు. కాలనీవాసులంతా కలిసి దానిని బంధించారు. అటవీ అధికారులు సమాచారం అందించారు. దానిని సురక్షిత ప్రాంతాల్లో వదలాలని కోరుతున్నారు.
Crocodile | గద్వాల జిల్లాలో అర్ధరాత్రి మొసలి కలకలం
