- వివాహితను దారుణంగా చంపేసి.. అతను ఉరేసుకొని..
- అనుమానాస్పదంగా ఇద్దరు మృతి
- సంచలనం రేపుతున్న జంట మరణాలు
- ఎదురెదురుగా ఉంటున్న ఇరు కుటుంబాలు
- సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ, ఎస్ ఐ
- గ్రామంలో ఉద్రిక్తత.. మృత దేహాలు పోస్ట్ మార్టంకు తరలింపు
గంభీరావుపేట, ఆంధ్రప్రభ: గంభీరావుపేట మండలం గజసింగవరంలో ఓ మహిళను అతికిరాతకంగా చంపి తాను ఉరివేసుకొని చనిపోయాడో వ్యక్తి.. రాజన్న సిరిసిల్ల జిల్లా గజ సింగవరంలో గురువారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరి మృతితో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.