Crime | సంచ‌ల‌నం సృష్టించిన హ‌త్య‌….

Crime | సంచ‌ల‌నం సృష్టించిన హ‌త్య‌….

Crime | మంచిర్యాల, ఆంధ్రప్రభ : వేధింపులు భరించలేక ఓ భార్య భర్తను కత్తితో పొడిచి ప్రాణాలు తీసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మొయిన్ (37), సుక్కల అవంతి పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. గత కొంతకాలంగా వీరి మధ్య సఖ్యత లేకపోవడంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మొయిన్ తన భార్య అవంతిని తరచూ శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం.

ఇవాళ మరోసారి గొడవ జరగడంతో ఆవేశానికి గురైన అవంతి, ఇంట్లోని కత్తితో మొయిన్ మెడపై బలంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావంతో మొయిన్ అల్లాడిపోవడంతో స్థానికులు స్పందించి వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మొయిన్ మృతిచెందాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న మంచిర్యాల సీఐ రమేశ్, ఎస్సై నరేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply