CRICKET | భారత యువ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంస‌క సెంచ‌రీ

CRICKET | భారత యువ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంస‌క సెంచ‌రీ

వెబ్‌డెస్క్(స్పోర్ట్స్‌, ఆంధ్ర‌ప్ర‌భ) : భారత యువ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్‌లో మూడో, చివరి వన్డేలోనూ దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ వైభవ్ (Captain vaibhav) కేవలం 63 బంతుల్లోనే విధ్వంసక శతకం బాదాడు. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు, క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టిన వైభవ్.. దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తంగా 127 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ కూడా సెంచ‌రీ చేశాడు. 118 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. గత మ్యాచ్‌లోనూ వైభవ్ ఇదే తరహాలో చెలరేగిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా కుదించిన ఆ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 24 బంతుల్లో 10 సిక్సర్లతో 68 పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు.

CRICKET

CLICK HERE TO READ ముహూర్తం ఫిక్స్‌..?

CLICK HERE TO READ MORE

Leave a Reply