CPM district | బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తున్నాం…

CPM district | బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తున్నాం…

CPM district | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఎం(CPM) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ… ఈ మధ్యకాలంలో జరుగుతున్న భూటక ఎన్ కౌంటర్(Encounterలను సీపీఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ఖండిస్తున్నామని అన్నారు.

బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల కాళ్ల కింద ఉన్న ఖనిజ సంపదను, అడవులను అమెరికా బ్రిటన్, జర్మనీ, జపాన్ దేశాలకు చెందిన పెట్టుబడిదారులతోపాటు అదానీ అంబానీల(Adani Ambani)కు కట్టబెట్టేందుకు వారితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నక్సలైట్ల పేరుతో అమాయకులైన ఆదివాసీలను చంపుతూ మావోయిస్టులను బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారన్నారు.

దొరికిన వారిని కోర్టులో హాజరు పరచకుండా చిత్రహింసల గురిచేసి ప్రాణాలు తీస్తే కోర్టులు ఎందుకని ప్రశ్నించారు. ఈ రాజ్య హింసను మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు ఖండించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్(S Venkat Goud), మోతిరామ్ నాయక్, కొత్త నరసింహులు, నాయకులు మోహన్ దశరథ్ పాల్గొన్నారు.

Leave a Reply