CPI | శత జయంతి సభను జయప్రదం చేయండి

CPI | శత జయంతి సభను జయప్రదం చేయండి

• మాల గురిజాలలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ
• తెలంగాణ సాయుధ పోరాటంలో పార్టీ పాత్ర అనన్య సామాన్యం
• మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ

CPI | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భవించి వంద ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 18న ఖమ్మం నగరంలో నిర్వహించనున్న శత జయంతి ఉత్సవాల ముగింపు సభను విజయవంతం చేయాలని సీపీఐ పార్టీ మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని మాల గురిజాల గ్రామంలో సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..

1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సీపీఐ, వంద ఏళ్లుగా బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ, తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. సాయుధ పోరాటంలో 4,500 మంది యోధులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగఫలమే నేటి హక్కులని పేర్కొన్నారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీగా సీపీఐకి గర్వకారణమైన చరిత్ర ఉందన్నారు. ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మంచిర్యాల జిల్లా సమితి సభ్యులు మేకల రాజేశం, మాల గురిజాల శాఖ కార్యదర్శి గోమాస గంగారం, రంగపేట శాఖ కార్యదర్శి జూపాక తిరుమలేష్, నాయకులు కలాలి భూమేశ్వర్, భోగి కుమార్, మెరుగు పోశం, గోమాస దేవయ్య, విజయ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply