రంజాన్ భద్రత ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

రంజాన్ భద్రత ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
- ప్రార్థన కేంద్రాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
- పోలీస్ గస్తీ,పెట్రోలింగ్ ముమ్మరం
- ఈద్గాలను సందర్శించిన పోలీస్ కమిషనర్
- అవాంఛనీయ సంఘటనలు జరుగకుండ చర్యలు
వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం హన్మకొండ లోని బొక్కల గడ్డ, పోతన నగర్ ఈద్గాలను ను సందర్శించారు. రంజాన్ ప్రార్ధనలను సజావుగా జరిగేందుకు పోలీస్ అధికారుల చేపట్టిన భద్రత ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ ఏ.ఎస్పీ శుభం, హన్మకొండ ఏసీపీ నర్సింహా రావు, ఇన్స్ పెక్టర్లు ఇతర పోలీస్ అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రంజాన్ సందర్భంగా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రార్థన కేంద్రాల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎటువంటి మత ఘర్షణలకు అవకాశమివ్వకుండా పోలీస్ గస్తీ, పెట్రోలింగ్ ను ముమ్మరం చేశారు.

