ఆవును దేవతగా పూజిస్తున్న కుటుంబం

ఆవును దేవతగా పూజిస్తున్న కుటుంబం

15 సంవత్సరాలుగా పాలను అందిస్తున్న గోమాత
మహారాష్ట్ర నుంచి ఆవు కొనుక్కొచ్చిన సురేష్ షెట్కార్ దంపతులు
ఎనిమిది సంతానన్నీ,ముని మనవళ్లు కూడా పాలందిస్తున్న వైనం
పాలను అమ్మకుండా పూజలకు,వైద్యానికి ఆవు దూడలకు అందజేత
ఆవుదూడ,దానిదూడకు సంప్రదాయంగా నామకరణం తొట్టెల కార్యక్రమం

జుక్కల్,ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లాకు సరిహద్దు మండలమైన జుక్కల్ మండలంలోని పెద్దగుల్ల గ్రామంలో ఒక ఆవు 15 సంవత్సరాలుగా ఇంకా పాలను అందిస్తూనే ఉంది. ఎనిమిది మంది సంతానం పుట్టిన సంతానానికి ఇంకా సంతానం పుట్టిన ఇంకా ఆవు పాలను అందిస్తూనే ఉంది. పెద్దగుల్ల గ్రామానికి చెందిన సురేష్ షెట్కార్-పద్మిని బాయి దంపతులు 15 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని బెమ్ర నుండి ఆవును కొనుకున్నారు.

సదరు ఆవు రెండు మూడు సంవత్సరాల అనంతరం వరుసగా 8 సంతానాన్ని జన్మనివ్వటం జరిగింది. అందులో నాలుగు ఆవులు కాగా, నాలుగు దూడలు ఉన్నారు. ఎనిమిదవ నంబర్ ఆవుకు ఆవు సంతానం కలగగా, ఆ సంతానానికి ఇంకా ఒక ఆవు దూడ కూడా జన్మనిచ్చింది. అవులకు,దూడలకు,తల్లిఆవు ఇంకా పాలను అందిస్తూనే ఉంది. 8వ సంతానంకు అవుకు అవుదూడ జన్మిచటంతో,ఆ ఆవుదూడకు ఇటీవల నామకరణం కార్యక్రమం నిర్వహించారు. చేయడమే,కాకుండా ఇక్కడి సంప్రదాయ ప్రకారం తొట్టెలను అన్ని రకాలుగా అందంగా అలంకరించి అందులో అవుదూడకు అలంకరణ చేసి తొట్టెలో వేసి సంప్రదాయ బద్ధకంగా నామకరణం చేసి మహిళలు పాటలు పాడుతూ తొట్టెలు ఉపారు.

బంధుమిత్రులకు భోజనానికి సైతం పిలవడం జరిగింది.ఆవు పదిహేను సంవత్సరాలు నుండి పాలిస్తున్నప్పటికీ ఆవు యజమాని సురేష్ షెట్కార్ ఇప్పటివరకు పాలను అమ్మకుండా ఆవు సంతానానికి,సంతానానికి పుట్టిన,మళ్ళీ ఆ సంతానానికి పుట్టిన సంతానానికి పాలు త్రగటానికి వినియోగించడమే కాకుండా,నైవేద్యాలకు,ఏదైనా ఆరోగ్య సమస్య మందులకు పాలు అందించటం జరుగుతుంది.గత 15 సంవత్సరాలుగా ఆవు పాలిస్తుండటంతో ఇంటికి యజమాని ఆవును దేవతగా భావిస్తూ ప్రతిరోజు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆ అవును తమ ఇంటి సభ్యులుగా ఏలోటు రాకుండా చూసుకోవడం కోసమెరుపు.

Leave a Reply