Court | ముగ్గురి అరెస్ట్

Court | ముగ్గురి అరెస్ట్
- లక్షేటిపేట జైలుకు తరలింపు
Court | జన్నారం, ఆంధ్రప్రభ : ఉమ్మడి జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వులోని తత్రపోషగూడెంకు చెందిన గడ్డం భీమయ్య, కొత్తపల్లి పోషం, తత్ర భీమయ్యలు అడవి పందిని హతమార్చి వండుకొనగా, ఇండ్లపై దాడి చేసి ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్(Forest Range) ఆఫీసర్ వి. సుష్మారావు ఈ రోజు సాయంత్రం తెలిపారు.
నమ్మదగిన సమాచారం మేరకు తనతోపాటు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఫారెస్టు సెక్షన్, బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంపు ఉద్యోగులు పి.మమత, కృష్ణారావు, పద్మజరాణి, తదితరులు ఆ నిందితుల ఇండ్ల వద్దకు వెళ్లి పట్టుకున్నట్లు ఆమె చెప్పారు. అనంతరం ఆ ముగ్గురి ఇండ్లలో సోదా చేయగా వండిన పంది మాంసం లభించిందని ఆమె తెలిపారు.
ఆ తర్వాత ఆ ముగ్గురి నిందితులను అరెస్టు చేసి లక్షేటిపేట కోర్టు(Court)లో హాజరు పర్చగా ఆ న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో అక్కడే ఉన్న జైలుకు తరలించామని ఆమె వివరించారు. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం’1972 ప్రకారం వన్యప్రాణులను హతమార్చినా, వేటాడినా, మాంసం విక్రయించినా, వండుకొని తిన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె చెప్పారు.
