కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని కోర్టు రూ.200 జరిమానా విధించింది. ఓ కేసులో ఎన్నిసార్లు పిలిచినా గైర్హాజరు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 14న జరగనున్న తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని.. లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కోర్టు రాహుల్ గాంధీని హెచ్చరించింది.
అసలు ఈ కేసు ఏంటి !
మహారాష్ట్రలో 2022లో మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని.. వారి నుంచి పెన్సన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు స్వాతంత్య్ర సమరయోధుడైన వీర్ సావర్కర్ ను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
ఈ పిటిషన్‌కు సంబంధించి తాజాగా మరోసారి విచారణ జరిగింది. రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది ప్రన్షు అగర్వాల్ హాజరు కాగా… ప్రస్తుతం లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ బిజీబిజీగా ఉన్నారని.. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.