Counting | పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి

Counting | పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి

Counting | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : మున్సిపల్ సాధారణ రెండో విడుత ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీపీ సాయి చైతన్య ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భీంగల్ వచ్చారు. ఈ సందర్బంగా ఎన్నికల సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ , కౌంటింగ్ కేంద్రం తో పాటు పోలింగ్ బూత్ లను సీపీ స్వయంగా పరిశీలించారు. ఫిబ్రవరి 11న జరగనున్న భీంగల్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సందర్భంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య భీంగల్ లో గల ప్రభుత్వ జూనియర్ కాలేజి లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత భీంగల్ మునిసిపాలిటీ ప్రాంతంలోని వివిధ పోలింగ్ బూత్ ల నుంచి వచ్చేటటువంటి బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనంతరం పోలింగ్ బూతులను పర్యవేక్షించారు. పోలింగ్ బూతుల వద్ద ప్రజలు ఎవరు కూడా గుమిగూడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Counting |

ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సిటిసి ఏసీపీ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, భీంగల్ ఎస్సై తిరుపతి, కమ్మర్పల్లి ఎస్సై అనిల్, మోర్తాడ్ ఎస్సైరాము, ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్ ఎం.పీ.డీ.వో గంగుల సంతోష్ కుమార్, తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్ ఎన్నికల పరిశీలకులు తదితరులు ఉన్నారు.

Counting |
Counting |

click here to read more : CrPC 41 | ఏసీబీకి పట్టుబడిన ఎస్‌ఐ..
click here to read more

Leave a Reply